chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :గుంటూరు పశ్చిమంలో తొమ్మిదో మహిళా గ్రీవెన్స్ విజయవంతం

గుంటూరు ;-పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇది వరుసగా తొమ్మిదో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం కాగా, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా విన్నారు. ప్రతి ఫిర్యాదుపై సానుకూలంగా స్పందిస్తూ, సాధ్యమైన పరిష్కారాలు, అవసరమైన చర్యలు, ఫాలోఅప్‌లను చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలకు సమస్యల పరిష్కారం ద్వారా ఊరట కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Guntur Local News :గుంటూరు పశ్చిమంలో తొమ్మిదో మహిళా గ్రీవెన్స్ విజయవంతం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయం మహిళలతో కళకళలాడుతుందని, మహిళలు ఎలాంటి భయం లేకుండా నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా ఓపెన్ వేదికగా మహిళా గ్రీవెన్స్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు సమస్యల నుంచి విముక్తి పొంది, ఆర్థికంగా బలంగా, గౌరవంగా, స్వావలంబనతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.Guntur Local News

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతం దిశగా మహిళల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, టీమ్‌వర్క్‌తో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker