
గుంటూరు నగరంలో విస్తృతంగా నాటుతున్న మొక్కలను పరిరక్షించడంలో పార్క్ సిబ్బంది, కార్మికులు భాధ్యతగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం పట్టాభిపురం, బ్రాడీపేట, నెహ్రూ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకై వార్డ్ ల వారీగా డివైడర్లు, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. నూతనంగా నిర్మాణం చేసే రోడ్ల పక్కన మొక్కలు నాటెందుకు వీలుగా రింగ్స్ కూడా ఏర్పాటు ౠ పేర్కొన్నారు. మొక్కలకు ప్రతి రోజు నీరు పోయడం, డివైడర్లోలోని పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ పచ్చదనంను పెంచడానికి పార్క్ కార్మికులు, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. పట్టాభిపురం రోడ్ ఆక్రమణలను గమనించి, వాటి పట్ల ఉదాశీనత పనికిరాదని, తక్షణం తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శంకర్ విలాస్ వంతెన పనుల వలన పెరుగుతున్నట్రాఫిక్ సమస్య ఆక్రమణల వలన మరింత జటిలంగా మారుతుందన్నారు. ప్రజారోగ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో ఉండడం లేదని గమనిస్తున్నామని, శుక్రవారం నుండి అలా గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. లాడ్జి సెంటర్ నుండి ఎల్ఈఎం స్కూల్ కి వెళ్లేదారిలో చేపట్టిన ఫ్లేవర్డ్ బ్లాక్స్ ఏర్పాటు పనులు మందకొండిగా సాగడం, క్యూరింగ్ చేయకపోవడంపై ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, 2 రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. నెహ్రూ నగర్ రిజర్వాయర్ త్రాగునీటిలో క్లోరిన్ తనిఖీ చేసి, రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, చేసిన, తదుపరి చేయాల్సిన తేదీలతో బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నాజ్ సెంటర్ లోని పబ్లిక్ టాయ్ లెట్స్ ని తనిఖీ చేసి, పరిశుభ్రంగా నిర్వహించాలని, ఫిర్యాదుల పుస్తకం పెట్టాలన్నారు. పర్యటనలో ఈఈ వేణుగోపాల్, డిఈఈలు కళ్యాణరావు, హనీఫ్, ఎస్ఎస్ లు ప్రసాద్, సాంబయ్య,ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







