
రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీ వేదికగా ‘యువ 2025’ (Yuva 2025) రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్. భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నైపుణ్యానికి అవకాశం అవసరం, కలలకు మార్గదర్శత్వం అవసరం, యువతకు మార్గదర్శకులు అవసరం ఇవన్నీ వున్నపుడు మాత్రమే భవిషత్తును సవాళ్ళను అధిగమనించి అందంగా నిర్మించుకోగలమని, అలా భవిష్యత్తుని అందంగా నిర్మించుకోవాలని కలలు కంటున్న యువతకు మార్గనిర్ధేశం చేయాలనే లక్ష్యం తో పాటు యువతలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికను కల్పించడమే యువ 2025 ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన యువతను జాతీయ యువజనోత్సవాలకు ఎంపిక చేస్తామన్నారు.ఈ ఏడాది యువ 2025 లో భాగంగా వివిధ రకాల పోటీలతో పాటు యూత్-కాన్ (Youth-Con), యూత్ ఛేంజ్‌మేకర్ టాక్స్ (Youth Changemaker Talks), మరియు యువ సంకల్ప వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టామన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రతిభావంతులను రాష్ట్ర యువతతో అనుసంధానం చేయడానికి ‘గ్లోబల్ డయాస్పోరా కనెక్ట్’ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. తద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి మెంటార్‌షిప్ అందుతుందన్నారు. యువత అధికారిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ కెరీర్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.







