
బాపట్ల:-అంగన్వాడీ సిబ్బంది విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన శామ్సంగ్ 5G మొబైల్ ఫోన్లను బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ సిబ్బందికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవలు మరింత వేగవంతంగా, నాణ్యంగా ప్రజలకు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను అందజేస్తోందని తెలిపారు. Bapatla Local Newsగతంలో పంపిణీ చేసిన 4G ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో సేవల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తాయని, వాటిని నివారించేందుకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం 5G నెట్‌వర్క్ మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.

ప్రభుత్వం అందజేసిన ఈ మొబైల్ ఫోన్లను సద్వినియోగం చేసుకుని అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత సులభతరం చేసి ప్రజలకు చేరవేయాలని అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.







