
బాపట్ల:-నాయకత్వం అంటే మాటలు కాదు… చేతలతో నిరూపించడమేనని మరోసారి చాటిచెప్పారు బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు. సహాయం కోరిన ప్రతి ఒక్కరికీ ధైర్యంగా నిలుస్తూ, “ఇది నా బాధ్యత” అనే భావనతో ప్రజాసేవలో ముందుండి నడుస్తున్నారు. “నాది–నీది” అనే తేడా లేకుండా, కష్టాల్లో ఉన్నవారికి ఆపద్బాంధవుడిలా నిలిచే నాయకుడిగా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
బాపట్ల ప్రజల ధైర్యం, ఆశ, విశ్వాసాలకు ప్రతిరూపంగా నిలుస్తున్న ఎమ్మెల్యే వర్మ రాజు, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా మారుతున్నారు. “అన్న అంటే నేనున్నాను” అనే భరోసాను చేతల ద్వారా చూపిస్తూ, వేలాది పేద కుటుంబాల కళ్లలో ఆశాకిరణం నింపుతున్నారు. తక్కువ మాటలు… ఎక్కువ చేతలు అన్నదే ఆయన నైజంగా ప్రజలు పేర్కొంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా మానవీయ దృక్పథంతో ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచేలా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యల వంటి అత్యవసర పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి (CMRF) ద్వారా తక్షణ సహాయం అందించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ సేవా దృక్పథంతో ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ అపార ఆదరణ పొందుతున్నారు.
అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే బాపట్ల నియోజకవర్గంలో రూ.5 కోట్లకు పైగా CMRF నిధులు మంజూరు చేయించి, వేలాది పేద కుటుంబాలకు కీలకమైన ఆర్థిక సహాయం అందించారు.బాపట్ల జిల్లా
మండలాల వారీగా CMRF చెక్కుల పంపిణీ వివరాలు:
- బాపట్ల రూరల్ మండలం: రూ.1 కోటి 72 లక్షల 85 వేలు
- బాపట్ల అర్బన్ మండలం: రూ.1 కోటి 18 లక్షల 67 వేలు
- కర్లపాలెం మండలం: రూ.1 కోటి 49 లక్షల 7 వేలు
- పిట్టలవానిపాలెం మండలం: రూ.69 లక్షల 85 వేలు
ప్రతి దరఖాస్తును స్వయంగా పరిశీలించి, అర్హులైన వారికి తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకుంటూ బాపట్ల ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు. పదవులు కాదు… ప్రజల ప్రేమే నిజమైన గుర్తింపని ఆయన సేవా రాజకీయాలు చాటిచెప్పుతున్నాయి.







