
బాపట్ల:-రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం (పెద్ద శివాలయం) కు ఉచితంగా ఫ్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేవస్థానంలో రాత్రిపూట నిద్రలు చేసే భక్తులు దోమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేవస్థానం చైర్మన్ బుర్లె రామ సుబ్బారావు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

ఈ సమస్యను గుర్తించిన వెంటనే రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్ వారి సౌజన్యంతో దేవస్థానానికి ఉచితంగా ఫ్యాన్లను అందించామని చెప్పారు. రోటరీ క్లబ్ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని ఆయన అన్నారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, కోశాధికారి కొత్త సుబ్బారావు, దేవస్థానం కమిటీ చైర్మన్ బుర్లె రామ సుబ్బారావు, సీనియర్ రోటరీ సభ్యులు ఉపేంద్ర గుప్తా, జే.వి. కృష్ణారావు, సుధీర్ కుమార్, దేవస్థానం పూజారి తదితరులు పాల్గొన్నారు.







