
Amaravathi:- డిసెంబర్ 20, 2025:-విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో నూతన జెన్ జెడ్ తపాలా కార్యాలయాన్ని భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ జెన్ జెడ్ తపాలా కార్యాలయంగా నిలిచింది.
ఈ కార్యాలయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అతిపెద్ద మరియు విశ్వసనీయ సంస్థలలో తపాలా శాఖ ఒకటని, ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

యువతను ఆకర్షించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్‌గా 50 నుంచి 60 జెన్ జెడ్ తపాలా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో మూడు కార్యాలయాలు ప్రారంభమవడం గర్వకారణమని, వాటిలో ఒకటి విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు ఈ ఆధునిక సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో తపాలా శాఖ నిర్వహించిన ఈ-కామర్స్ హ్యాకతాన్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లు అందజేశారుAmaravathi Local News :పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం-సీఎం చంద్రబాబు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.పి. శ్రీదేవి, విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ డా. వెన్నం ఉపేందర్, విఐటి–ఏపి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (ఇన్‌చార్జ్) డా. పి. అరుల్మోళివర్మన్, రిజిస్ట్రార్ డా. జగదీష్ చంద్ర ముదిగంటి, తపాలా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







