
ఏలూరు :- టీ. నరసాపురం మండల ప్రజలకు శుభవార్త. పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ నెల మంగళవారం నాడు ప్రజల వద్దకే వచ్చి గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించనున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ విషయాన్ని జనసేన పార్టీ టీ. నరసాపురం మండల అధ్యక్షులు అడపా నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.Eluru Local News:గొలుసు లాకింగ్ కేసును ఛేదించిన ధర్మాజీగూడెం పోలీసులు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ జనవాణి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, వ్యక్తిగత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

గ్రామస్థులు తమ సమస్యలను అధికారికంగా, నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేసే అవకాశం చాలా అరుదుగా లభిస్తుందని, అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అడపా నాగరాజు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, పింఛన్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ముందుకు రావాలని సూచించారు.







