
చీరాల:- ఎమ్మెల్యే గారి నివాసంలో శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారిని, ఆయన ధర్మపత్ని శ్రీమతి మద్దులూరి బాలకొండమ్మ గారిని, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ గారిని, యువ నాయకులు శ్రీ మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారిని ప్రకాశం జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గౌ. శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ, యువ గళం పాదయాత్రలో మరియు గత ఎన్నికల ప్రచారంలో వీరయ్య చౌదరి అన్నగారితో సన్నిహితంగా కలిసి పనిచేశామని గుర్తు చేశారు. వీరయ్య చౌదరి గారిని కోల్పోవడం తీరని లోటు అని భావోద్వేగంగా తెలిపారు.Chirala lo TDP ప్రత్యేకంగా తన కుమారులతో ఒక సోదరుడిగా మెలిగిన వ్యక్తి వీరయ్య చౌదరి గారని చెప్పారు.

అలాగే, చీరాల నియోజకవర్గం నుంచి అన్ని విధాలా అండగా నిలుస్తామని గౌ. శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు ఈ సందర్భంగా మాట ఇచ్చారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.







