
నరసరావుపేట: శనివారం:-జిల్లా కోర్టు ఏపీపి జీవీఎస్ ప్రసాద్ ఇటీవల 13వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన నేపథ్యంలో, తన నియామకానికి సహకరించిన కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నరసరావుపేట స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును జీవీఎస్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబుకు పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు జీవీఎస్ ప్రసాద్‌ను అభినందిస్తూ, నూతన బాధ్యతల్లో సమర్థవంతంగా పని చేసి న్యాయవ్యవస్థకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.నరసరావుపేటలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు – ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ అరవింద బాబు||Grand Teachers’ Day Celebrations in Narasaraopet – Chief Guest Dr. Chadalavada Aravind Babu
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆర్ అండ్ బి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ, ఆయన మిత్రులు విజయ్, గోపి, దినేష్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అప్పిశెట్టి లక్ష్మీనారాయణ, అడ్వకేట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.







