
వరల్డ్ కప్–2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీం ఇండియా జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
జట్టులో యువతకు తోడు అనుభవజ్ఞులకు అవకాశం కల్పిస్తూ సమతూకంగా ఎంపికలు చేసినట్లు బీసీసీఐ తెలిపింది. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్య, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు.Hyderabad- Amaravathi
బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా పేస్ బాధ్యతలు చేపట్టనుండగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు దక్కించుకున్నారు.
వికెట్‌కీపింగ్ బాధ్యతలను సంజు శాంసన్, ఇషాన్ కిషన్ నిర్వహించనున్నారు. ఈ జట్టుతో వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునే దిశగా టీం ఇండియా బరిలోకి దిగనుంది.







