
బాపట్ల డిసెంబర్ 21:-మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు నెస్లీ కంపెనీ తనవంతు సహాయాన్ని అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన ఎస్టీ కుటుంబాలకు నెస్లీ కంపెనీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 600 ఎస్టీ కుటుంబాలకు 13 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని తెలిపారు. నిరుపేదలైన ఎస్టీ కుటుంబాలను గుర్తించి బాధ్యతతో సహాయం అందించడం అభినందనీయమని అన్నారు.Bapatla Local News రైల్వే పేట ప్రాంతంలో 65 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నెస్లీ కంపెనీని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి. గ్లోరియా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్, నెస్లీ కంపెనీ అధికారి వసీమ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.







