

వినుకొండ:- Maths Science Olympiad గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి సందర్భంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ – 2025 ప్రతిభా పరీక్షను ఎం.కె.ఆర్ అండ్ కే.ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ ప్రతిభా పరీక్ష నిర్వహించినట్లు పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల నుండి 1200 పైగా విద్యార్థినీ విద్యార్థులు హాజరైనట్లు గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి తెలిపారు. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కాలువ కట్టపై ఉన్న గీతమ్స్ బ్లూమ్స్ పాఠశాల నందు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులకు సిద్ధార్థ నగర్ లోని గీతమ్స్ హైస్కూల్ నందు ఈ ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి క్లాస్ కు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు(2000,1500,1000) నగదు ప్రోత్సాహక బహుమతి మరియు మెమొంటోస్ అందించామని మరియు నాలుగవ, ఐదవ స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







