

మాజీ సైనికుల వార్షిక ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొనటం సంతోష దాయకం….బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి
బాపట్ల మండలం పాండురంగాపురం సముద్రతీరాన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యుల తో జరిగిన వార్షిక ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని శుభా కాంక్షలు తెలియ జేసి, బాపట్ల నియోజకవర్గ మరియు జిల్లా మాజీ సైనికుల తో ను మరియు కుటుంబ సభ్యులతో ను పలు అంశాలపై ముచ్చటించారు.
ముందుగా బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి సారధ్యంలో మాజీ సైనికుల పిల్లలతో సహా కుటుంబ సభ్యులకు అనేక క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్ల అసోసియేషన్ వారు నిర్వహించుకునే వార్షిక ఆత్మీయ సమ్మేళనానికి బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం మరియు గుంటూరు జిల్లా తెనాలి అసోసియేషన్ల నాయకులు కూడా,
మా ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్నందుకు బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి ధన్యవాదాలు తెలియ చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, వార్షిక ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని, కుటుంబ సభ్యుల తో ఆహ్లాదంగా గడుపుకునే సాంప్రదాయాన్ని అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన బాపట్ల అసోసియేషన్ సభ్యుల కు అభినందనలు తెలిపారు. కష్టసుఖాలలో ఇదే విధంగా ఒకరికి ఒకరూ తోడుగా ఉంటూ ఐక్యతను కలిగి ఉండాలి అని సూచించారు.
క్రీడలలో ను మరియు సాంస్కృతిక కార్యక్రమాలలోనూ విజేతలకు ముఖ్య అతిథి తాండ్ర సాంబశివరావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
బాపట్ల అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న నిజాంపట్నం అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సుల్తాన్, మరియు తెనాలి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు షేక్ సుభాని మరియు తెనాలి అసోసియేషన్ ట్రెజరర్ వీరబ్రహ్మం లను స్టేట్ ప్రెసిడెంట్ తాండ్ర సమక్షంలో బాపట్ల అసోసియేషన్ సభ్యులు దుస్సాలువాలతోను పుష్ప గుచ్చాల తోను సన్మానించారు.
తెనాలి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు SM సుభాని మరియు నిజాంపట్నం అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సుల్తాన్ లు మాట్లాడుతూ, బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న మెజారిటీ అసోసియేషన్ లను ఏకతాటిపై నడిపించి మాజీ సైనికుల ఐక్యతను తెలియజేసిన దమ్ము ధైర్యాలు కలిగిన మాజీ సైనికుల నాయకుడు తాండ్ర సాంబశివరావు లాంటి సామర్ధ్యం కలిగిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవటం సంతోష దాయకం అని కొనియాడారు. పసందైన విందు భోజనాలతో సమ్మేళనాన్ని ముగిస్తూ భారతమాతకు జై నినాదాలతో హోరెత్తించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, జనరల్ సెక్రెటరీ షేక్ మొయినుద్దీన్, ట్రెజరర్ పువ్వాడ యల్లమంద, జాయింట్ సెక్రెటరీ పీటా సారధి, జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, నిజాంపట్నం అసోసియేషన్ ప్రతినిధి నాగరాజు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు మాధవీలత, డి వెంకటేశ్వర్లు, రుక్మదరరావు, షేక్ కరిముల్లా, ఖలీల్, బసివి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, వల్లూరి భావన్నారాయణ, వుడా నాగరాజు, శ్రీమతి తిరుపతమ్మ, కృష్ణకుమారి, మొదలగు మాజీ సైనికులు మరియు కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








