
వినుకొండ:-స్థానిక సిద్ధార్థ నగర్‌లోని రాధా డిగ్రీ కాలేజీలో సోమవారం క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కంపెనీ స్పార్క్ ఎడెక్స్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించగా, మొత్తం 20 మంది విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.
కంపెనీ హెచ్ఆర్ బృందం గ్రూప్ డిస్కషన్, జామ్ రౌండ్, ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను పరీక్షించి, ప్రతిభ చూపిన 7 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే. హరీష్ కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు వార్షికంగా రూ.1.8 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం అందజేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.PALNADU NEWS: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి.
విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా విద్యార్థులకు శాతం శాతం ప్రోత్సాహం అందిస్తామని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.వి. రాధాకృష్ణమూర్తి, ఉద్యోగ కల్పణాధికారి పి. హనుమంత్ రావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.










