
Thadepalli:- ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తెనాలికి చెందిన అనుమోలు విజయ్ కుమార్ గౌడ్‌ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా తాడేపల్లి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నారగోని చేతుల మీదుగా విజయ్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. THADEPALLI NEWS .:రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ నీరు….అనంతరం నారగోని మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అనుమోలు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరినీ కలుపుకొని కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







