
మంగళగిరి 22:-రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భోగి ఎస్టేట్స్‌లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ పోటీలు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి.
రెండవ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఎనిమిది జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. అంబేద్కర్ లెవెన్స్ ఈమని వర్సెస్ పీసీ లయన్స్ కాజ మధ్య జరిగిన మ్యాచ్‌లో పీసీ లయన్స్ కాజ జట్టు విజయం సాధించింది. లెవెన్ థండర్స్ వర్సెస్ సాయి సీసీ లెవెన్ మ్యాచ్‌లో లెవెన్ థండర్స్ గెలుపొందగా, కొత్తపేట సూపర్ కింగ్స్ వర్సెస్ గల్లీ వారియర్స్ మ్యాచ్‌లో కొత్తపేట సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. పవన్ సీసీ వర్సెస్ హనుమాన్ యూత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పవన్ సీసీ జట్టు గెలిచింది.
ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా లైవ్‌లో అందిస్తున్నారు. ప్రతీ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారుడికి మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో రూ.3,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు.
ఈ టోర్నమెంట్ రెండవ రోజు కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ నాయకులు, తెలుగు యువత నాయకులు పోటీలను పర్యవేక్షించారు.AIIAMS Mangalagiri lo
ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బిజ్ 51, సోనోవిజన్, హోటల్ డి దేవ్, తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పిటల్స్, సిగ్నేచర్ డైన్, హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, కోకోకోలా, వీ వైబ్ ఈవెంట్స్ వ్యవహరిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపీ టీవీ యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
ప్రీమియర్ లీగ్ సీజన్–4లో ప్రథమ బహుమతిగా రూ.3 లక్షలు (మంగళాద్రి డెవెలపర్స్), ద్వితీయ బహుమతిగా రూ.2 లక్షలు (మంచికలపూడి వైష్ణవి), తృతీయ బహుమతిగా రూ.1 లక్ష (వెలగపూడి కిషోర్) అందించనున్నారు. అలాగే ప్రతి మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రూ.3,000 (జవ్వాది కిరణ్ చందు), టాస్ విజేతలకు సిల్వర్ కాయిన్, ఫైనల్ టాస్ విజేతకు గోల్డ్ కాయిన్ (రేవతి జ్యూయలరీ) అందించనున్నారు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎలక్ట్రానిక్ బైక్ (వల్లభనేని భార్గవ్), బ్యాట్స్‌మన్ ఆఫ్ ది సిరీస్, బౌలర్, ఫీల్డర్, వికెట్ కీపర్ ఆఫ్ ది సిరీస్ విజేతలకు రూ.25,000 నగదు బహుమతులతో పాటు బైసైకిళ్లు అందజేయనున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికీ టీషర్టులు, ట్రాక్స్ పంపిణీ చేయనున్నారు.







