
చీరాల:డిసెంబర్ 23 2025:-ఒంగోలు లోని క్విస్ కాలేజ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల విద్యార్థుల జట్టు విజేతగా నిలిచి జయకేతనం ఎగురవేసింది. ఈ పోటీల్లో జిల్లాలోని 16 కళాశాలల జట్లు పాల్గొనగా, కఠినమైన పోటీని తట్టుకొని ఫైనల్‌లో క్విస్ కాలేజ్ జట్టును ఓడించి సెయింట్ ఆన్స్ జట్టు విజయం సాధించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డా|| కె. జగదీష్ బాబు తెలిపారు.
ఈ ఘన విజయం సాధించిన సందర్భంగా కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు సంయుక్తంగా అభినందనలు తెలిపారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు.Bapatla pattanam lo MLA
విజేత జట్టులో ఆర్. రమణ, జి.వి.ఆర్. తేజా రెడ్డి, రాజారత్నం, జి. మైకేల్, కె. డాని, కె. సాయి కుమార్, నవీన్, ఆదిత్య, డేని వెంకట మణి కుమార్ పాల్గొన్నట్లు కళాశాల వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాస రావు తెలిపారు.Chirala Local News
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా|| సి. సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేత జట్టును ఘనంగా అభినందించారు.










