
బాపట్ల:డిసెంబర్ 23:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో తేదీ 30-12-2025న బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల నందు నిర్వహించనున్న జాబ్ మేళా గోడపత్రికను బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్ వి గారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాబ్ మేళాల వంటి కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు.TODAY BAPATLA NEWS
ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిణి శ్రీమతి యం. మాధవి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, రవి కిరణ్ – ఏడీఎస్డీ (ఇంచార్జ్), హారిక సౌగంధి – వైపీ, తదితరులు పాల్గొన్నారు.










