chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla local news :బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహణ

బాపట్ల: -బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సంయుక్తంగా ప్రారంభించారు. ఒక కోటి 48 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించనుంది.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నూతన భవనం ద్వారా విద్యార్థులు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి విద్యా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ వి. వినోద్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు.Bapatla Local News

ఈ కార్యక్రమంలో ఆర్డీవో గ్లోరియా, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి, యమ్మెర్వో సలీమా, టీడీపీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త శివన్నారాయణ, మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీతో పాటు ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, స్కౌట్స్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నూతన భవనం ప్రారంభంతో పాఠశాలలో విద్యా వాతావరణం మరింత మెరుగుపడుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker