
ఏపీ సెక్రటేరియట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయస్వామి గారిని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అవసరాలు, పలు సంక్షేమ పథకాల అమలు తీరుపై సుదీర్ఘంగా చర్చించారు.
నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే మాలకొండయ్య గారు మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, సామాజిక భద్రతా పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరాన్ని వివరించారు.
అదేవిధంగా అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరు, పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి గారు చీరాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్
ఈ భేటీ చీరాల నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత బలమైన దిశానిర్దేశం చేయనుందని రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.







