chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :ఓవర్‌ఆల్‌ చాంపియన్‌షిప్‌ ను కైవసం చేసుకున్నా-సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి, చీరాల

చీరాల:డిసెంబర్‌ 24:-గుంటూరు జిల్లా హిందూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ “ఆదర్శ్‌–2025” లో సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి, చీరాల విద్యార్థులు సత్తా చాటి ఓవర్‌ఆల్‌ చాంపియన్‌షిప్‌ ను కైవసం చేసుకున్నారు.

ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణా రావు మరియు కళాశాల కరస్పాండెంట్‌ యస్‌. లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.Chirala Local News రాష్ట్ర స్థాయి పోటీల్లో చీరాల సెయింట్‌ ఆన్స్‌ కళాశాల జట్లు విజయ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని వారు పేర్కొన్నారు.

కళాశాల ప్రధాన అధ్యాపకులు డా|| కె. జగదీష్‌ బాబు మాట్లాడుతూ, మెన్స్‌ వాలీబాల్‌, ఉమెన్స్‌ వాలీబాల్‌, మెన్స్‌ మరియు ఉమెన్స్‌ బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌ (మెన్స్‌, ఉమెన్స్‌) విభాగాల్లో విజేతలుగా నిలవడంతో పాటు, ఉమెన్స్‌ షాట్‌పుట్‌లో మొదటి, రెండవ స్థానాలను సాధించడం ద్వారా ఓవర్‌ఆల్‌ చాంపియన్‌షిప్‌ దక్కిందని తెలిపారు.

కళాశాల వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాస రావు మాట్లాడుతూ, విజేత జట్లకు హిందూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి యాజమాన్యం నగదు బహుమతులు అందజేశారని తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ ఆర్‌.వి. రమణ మూర్తి, డైరెక్టర్‌ (అక్రిడిటేషన్స్‌) డా|| సి. సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని, మెన్స్‌ వాలీబాల్‌, ఉమెన్స్‌ వాలీబాల్‌, మెన్స్‌–ఉమెన్స్‌ బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, మెన్స్‌–ఉమెన్స్‌ షాట్‌పుట్‌ జట్లను ఘనంగా అభినందించారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థుల విజయం కళాశాల క్రీడా ప్రతిభకు నిదర్శనమని పలువురు ప్రశంసించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker