
బాపట్ల:-గౌరవనీయులు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ తేనేటి కృష్ణ ప్రసాద్ గారిని బహుజన సమాజ్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి బాపట్ల జిల్లాకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు వందే భారత్ రైలు బాపట్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బాపట్ల నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ ఏర్పాటు, ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ లోన్ల అమలు, జిల్లా హెడ్కోర్టు పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా పార్లమెంటు సభ్యుడి దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలను శ్రద్ధగా విన్న గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ తేనేటి కృష్ణ ప్రసాద్ గారు, వీటిపై సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.Bapatla local news
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు, బహుజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు శీలం రోజూన్ బాబు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఏపూరి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.










