
బాపట్ల:-బాపట్ల పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫారసుల మేరకు పర్చూరు నియోజకవర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది.

ఈ నియామకాలలో నక్కల రాఘవ (కడవకుదురు)ను బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా, రావిపాటి సీతయ్య (పోలూరు)ను పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా, సయ్యద్ ఆజాద్ (చిన్నగంజాం)ను పార్లమెంట్ అధికార ప్రతినిధిగా, కాకోలు వెంకటేశ్వర్లు (మార్టూరు)ను పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, సుధారాణి (నాగులపాలెం)ను పార్లమెంట్ కార్యదర్శిగా నియమించారు.Bapatla Local News

నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలన్నారు. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీకి మరింత బలం చేకూర్చాలని సూచించారు.

పదవులకు వన్నె తీసుకొచ్చేలా ప్రజల్లో విశ్వాసం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

పర్చూరు నియోజకవర్గానికి పార్లమెంట్ కమిటీలో కీలక ప్రాతినిధ్యం లభించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.










