chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Locl News :జనవరి 15లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానం అమలు-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు: డిసెంబర్ 23 :-గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారానికి జనవరి 15 నాటికి ఈ–ఆఫీస్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.

Guntur Locl News :జనవరి 15లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానం అమలు-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, హౌసింగ్, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయించకుండా మండల స్థాయి కమిటీలు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

Guntur Locl News :జనవరి 15లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానం అమలు-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం జనవరి 3 నుంచి 15 వరకు గుంటూరులో నిర్వహించనున్న ‘సరస్–2026’ ఎగ్జిబిషన్పై జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల గృహ ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎంపీడీవోలు, తహసీల్దార్లు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికను కఠినంగా అమలు చేయాలని, ఇందుకోసం పాఠశాలలకు నియమించిన నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత మెరుగుపడేలా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు.ఆంధ్రప్రదేశ్

జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Guntur Locl News :జనవరి 15లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానం అమలు-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, హౌసింగ్ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ శంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి కీర్తి, కోమలి పద్మ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker