
వేటపాలెం, డిసెంబర్ 27:సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో “సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బియాండ్ ది క్లాస్ రూమ్” అనే అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఎ.ఐ.ఎం.ఎల్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కే. సాంబ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Chirala Local News :చీరాల బాయ్స్ హై స్కూల్ ఆవరణలో ఘనంగా హిందూ సమ్మేళనం
ఈ గెస్ట్ లెక్చర్‌ను కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్. లక్ష్మణరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, తరగతి గదిలో పొందే సిద్ధాంత జ్ఞానంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్ అవగాహన విద్యార్థులకు ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి గెస్ట్ లెక్చర్లు విద్యార్థుల కెరీర్‌కు దోహదపడతాయని అన్నారు.
ముఖ్య అతిథి కే. సాంబ విద్యార్థులతో మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్ రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యతను వివరించి, రియల్ టైమ్ అప్లికేషన్లను క్లౌడ్‌లో ఎలా నిర్వహించాలి, స్కేలబిలిటీని ఎలా సాధించాలి అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. అలాగే ఏపీఐ కీస్ అవసరం, వివిధ అప్లికేషన్లతో అనుసంధానంలో వాటి పాత్ర, భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
మెషీన్ లెర్నింగ్ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, పరిశ్రమల్లో వాటి వినియోగం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై కూడా ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టుల అవసరానికి అనుగుణంగా సరైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. తరగతి గదిలో నేర్చుకునే సిద్ధాంత జ్ఞానానికి మించి, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో ఎలా ఎదగాలి, నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశాలపై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కే. సాంబ సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ విషయాన్ని ఎ.ఐ.ఎం.ఎల్ విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్. హరికిషన్ తెలిపారు. ఈ గెస్ట్ లెక్చర్‌కు డాక్టర్ పి.ఎస్. నవీన్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఎ.ఐ.ఎం.ఎల్ విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్. హరికిషన్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గెస్ట్ లెక్చర్‌ను విజయవంతం చేశారు.











