
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో అర్థం ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిపై దృష్టి పెట్టింది అనడానికి ఈ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పవచ్చు. స్థానిక అవసరాలను కృష్ణ బాబు దగ్గరికి తీసుకువెళగా ఆయన వెంటనే స్పందించి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ను మంజూరు చేయించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రాంతాలవారీగా ఏర్పడితే జిజిహెచ్ పై భారం తగ్గుతుంది. ఇది మాధవి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల రావడం సాధ్యమైంది. అందరి సమిష్టి కృషితో ఈ సెంటర్ రావడం జరిగింది. సుమారు కోటి రూపాయలు నిధులతో ఈ యూపీహెచ్ సీ నిర్మాణాన్ని చేపడుతున్నారు.మనస్పూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గత పదేళ్లుగా మౌలిక వసతుల లోపంతో ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, అయినప్పటికీ తాగునీరు, చెత్త, దోమల సమస్య, రహదారులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి అంశాలు ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర స్థానికంగా అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ హెల్త్ సెంటర్ ను అప్రూవ్ చేసినందుకు కృష్ణబాబు కి, తీసుకొచ్చినందుకు మాధవి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.







