
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈమేరకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా యువత మెడకు ఉరి తాళ్ళు బిగించుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు, జిల్లా కార్యదర్శి షేక్ వలీ, జంగాల చైతన్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు పదవుల దక్కాయి తప్ప నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి రాలేదని వారు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడించడం ఖాయమని వారు హెచ్చరించారు.







