
Bapatla:Parchur :-ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధికే కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటికి తక్షణ పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ, రాష్ట్రం ప్రస్తుతం విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి – సంక్షేమం అనే నినాదంతో ప్రజల ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.TODAY BAPATLA NEWS
గత ఐదేళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన అనేక ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ, ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్లు వెల్లడించారు.
అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సాగునీరు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి నుంచి పట్టణాభివృద్ధి వరకు అన్ని రంగాల్లో సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండబోదని, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.










