BREAKING NEWS – GUNTUR: గుంటూరులో ఏడుగురు అడ్మిన్ కార్యదర్శులను విధుల నుండి సస్పెండ్ చేసిన కమీషనర్
GUNTUR COMMISSIONER ACTION
గుంటూరు నగరంలో ఆస్తి పన్ను వసూళ్ళలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, గత వారం రోజుల్లో జీరో వసూళ్లు చేసిన 7 మంది అడ్మిన్ కార్యదర్శులను విధుల నుండి సస్పెండ్ చేయాలని, పర్యవేక్షణ లోపం పై 4 మంది రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అదనపు కమీషనర్ ను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు రెవిన్యూ విభాగం అధికారులతో ఆస్తి పన్ను వసూళ్ళపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సదరు సమావేశంలో తొలుతగా సచివాలయాల వారీగా ఉన్న డిమాండ్ మరియు గత వారం రోజుల పన్ను వసూళ్ళ వివరాలను అడిగి తెలుసుకొని, యం. నాగరాజు (14), డి.జయలక్ష్మి (7), యస్.కె.బి అరుణ్ కుమార్ (154), జె.పవన్ కుమార్(191), కె. కామేశ్వర రావు (163), షేక్ షబీన (40), జి. రేవంత్ నాగసాయి (60) అడ్మిన్ కార్యదర్శులను, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లైన ఖజావలి, కాశయ్య, సుబ్బారావు, నాగరాజులకు షోకాజ్ నోటీసులు జారే చేయాలనీ అదనపు కమీషనర్ ను ఆదేశించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, నగరాభివ్రుద్దిలో ఆసి పన్ను వసూళ్లు ఎంతో కీలకమని, పన్ను వసూళ్ళ పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అస్సేస్మేంట్ ల వారీగా డిమాండ్ నోటీసుల పంపిణీ పూర్తి చేయాలని, ఇంచార్జ్ అద్మిన్లు ఉన్న చోట ఆర్.ఐ లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆర్.ఓ ల వారీగా పన్ను వసూళ్ళపై మార్చ్ వరకు రోజువారీ నిర్దేశించుకోవడం, సమీక్షించుకోవడం చేయాలన్నారు. దీర్ఘకాలం పెద్దమొత్తంలో బకాయిలు ఉండి చెల్లించని కమర్షియల్ సంస్థలను చట్ట ప్రకారం పంచనామా జరిపి సీజ్ చేయాలన్నారు. డిప్యుటీ కమీషనర్లు ప్రతి రోజు పన్ను వసూళ్ళ పురోగతి పై సమీక్షించి ఏదో ఒక ప్రాంతంలో వసూళ్ళలో పాల్గోనాలన్నారు. అండర్ అస్సేస్మేంట్లు, అన్ అస్సేస్మెంట్లు ఉండటానికి వీలులేదని, నిర్మాణ దశలో ఉన్న నిర్మాణాలకు ఖాళీ స్థల పన్ను విధించాలన్నారు. అపార్ట్మెంట్లలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కొరకు వేచి ఉండకుండా నివాసం ఉంటున్న ప్రతి ప్లాటుకు పన్ను విధించాలని ఆదేశించారు. వాటర్ చార్జెస్ చెల్లించని వారి గృహాలకు వాటర్ కనెక్షన్లను కట్ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. షాప్ లీజులు పూర్తైన వాటికి నిబంధనల ప్రకారం లీజులను పునరుద్దరించాలని, అలాగే 25 సంవత్సరాలు పై బడిన వాటికి టెండర్ ప్రక్రియ నిర్వహించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్లు సి.హెచ్. శ్రీనివాసరావు, టి. వెంకట కృష్ణయ్య, ఆర్.ఓ లు రవికిరణ్ రెడ్డి, సాదిక్ బాషా, రెహమాన్, మదన్ గోపాల్, ఆర్.ఐ లు, కార్యదర్శులు పాల్గొన్నారు.