chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

chirala Local News : 2025 రిలయన్స్‌ ఫౌండేషన్‌ వారి స్కాలర్‌షిప్‌ను సాధించిన సెయింట్‌ ఆన్స్‌ విద్యార్ధి యు. పావని

చీరాల:-సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి, చీరాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ను సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచిందని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్‌ యస్‌. లక్ష్మణ రావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.

chirala Local News : 2025 రిలయన్స్‌ ఫౌండేషన్‌ వారి స్కాలర్‌షిప్‌ను సాధించిన సెయింట్‌ ఆన్స్‌ విద్యార్ధి యు. పావని

కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న యు. పావని ప్రియ ఇటీవల రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభ చూపి ఈ ప్రతిష్ఠాత్మక స్కాలర్‌షిప్‌ను కైవసం చేసుకుందని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డా. యస్‌.వి.డి. అనిల్‌ కుమార్‌ తెలిపారు.

ఈ స్కాలర్‌షిప్‌ కింద విద్యార్థినికి సంవత్సరానికి రూ.50,000 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయం రిలయన్స్‌ ఫౌండేషన్‌ అందజేయనున్నట్లు ఆయన వివరించారు.

ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఫస్ట్‌ ఇయర్‌ ఇన్‌చార్జ్‌ యస్‌. అమరనాధ్‌ బాబు, ఈసీఈ విభాగాధిపతి డా. డి. రాజేంద్ర ప్రసాద్‌, డా. రు. రత్నరాజు, పి. అనిల్‌ కుమార్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని యు. పావని ప్రియను ఘనంగా అభినందించారు.Bapatla Local News

జాతీయ స్థాయిలో ఈ స్కాలర్‌షిప్‌ను సాధించడం కళాశాల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ప్రిన్సిపాల్‌ డా. యస్‌.వి.డి. అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker