chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :పదవ తరగతి భవిష్యత్తుకు పునాది-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు: డిసెంబర్ 30:-పదవ తరగతి పరీక్షల్లో సాధించే మార్కులే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలకు పదవ తరగతి కీలకమని విద్యార్థులకు సూచించారు.

మంగళవారం గుంటూరు నగరంలోని ఏ.టి. అగ్రహారంలో ఉన్న ఎస్.కే.బి.ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, బోధన విధానం, పరీక్షల సన్నద్ధతపై ఆరా తీశారు. తరగతి గదులు పరిశీలించి విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకున్నారు.

Guntur Local News :పదవ తరగతి భవిష్యత్తుకు పునాది-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, సీఏలు, ఆర్మీ అధికారులుగా ఎంత మంది అవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించి విద్యార్థుల అభిరుచులను కలెక్టర్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే భవిష్యత్తు బలంగా ఉంటుందని తెలిపారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థులు చదువుకోవాలని సూచించిన కలెక్టర్, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమించామని, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.

Guntur Local News :పదవ తరగతి భవిష్యత్తుకు పునాది-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

విద్యార్థులు మాక్ టెస్ట్ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించాలని, గణితం, బయాలజీ, హిందీ సబ్జెక్టులకు అదనపు తరగతులు కావాలని, సాయంత్రం స్టడీ అవర్స్‌లో అల్పాహారం అందించాలని కోరారు. guntur 3దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ మాక్ టెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన సబ్జెక్టులకు అదనపు తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సాయంత్రం స్టడీ అవర్స్‌లో అల్పాహారం అందిస్తామని స్పష్టం చేశారు.

Guntur Local News :పదవ తరగతి భవిష్యత్తుకు పునాది-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా మాట్లాడి, అవసరమైన సబ్జెక్టుల్లో అదనపు తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. సలీం భాష, ఎంఈఓ ఖుద్దూస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాజావలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker