chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :వ్యవసాయ భూములు ఏ మండలంలో ఉంటే ఆ మండలంలోని రైతులకు ఎరువులు పంపిణీ-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్

బాపట్ల: డిసెంబర్ 30 :-రైతుల వ్యవసాయ భూములు ఏ మండలంలో ఉంటాయో, అదే మండలంలో రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ స్పష్టం చేశారు.

మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల వ్యవసాయ అధికారులు, ఏడీలు, గృహ నిర్మాణ సంస్థ ఏఈలు, డీఈలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎరువుల పంపిణీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణాలు, మున్సిపల్ సేవలు, ఇంటింటి చెత్త సేకరణ అంశాలపై సమీక్షించారు.

Bapatla Local News :వ్యవసాయ భూములు ఏ మండలంలో ఉంటే ఆ మండలంలోని రైతులకు ఎరువులు పంపిణీ-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ జరగాల్సిన పూర్తి బాధ్యత మండల వ్యవసాయ అధికారులదేనని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎరువుల కొరత లేదా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.

ఐఎఫ్ఎంఎస్‌ను ప్రతిరోజూ అప్డేట్ చేయాల్సిన బాధ్యత కూడా మండల వ్యవసాయ అధికారులదేనని పేర్కొన్నారు. ఎరువుల పంపిణీలో మెరుగైన పనితీరు కనబర్చిన మండల వ్యవసాయ అధికారులకు జనవరి 26న అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఎరువుల నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపడుతున్న పేదల గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంలో రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా టాప్–3లో నిలిచేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను అప్డేట్ చేసి, గృహ నిర్మాణాలు పూర్తిచేసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.

Bapatla Local News :వ్యవసాయ భూములు ఏ మండలంలో ఉంటే ఆ మండలంలోని రైతులకు ఎరువులు పంపిణీ-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్

గృహ నిర్మాణానికి నిధులు సమృద్ధిగా ఉన్నాయని, పనుల పురోగతి మందగించిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి కారణాలు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు.Bapatla Local News

అలాగే మున్సిపాలిటీల పరిధిలో ప్రతిరోజూ ఇంటింటి నుండి వందశాతం చెత్త సేకరించి వెంటనే డంపింగ్ యార్డులకు తరలించాలని సూచించారు. మున్సిపల్ సేవలపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ సమావేశంలో ఇంచార్జి జిల్లా వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి మున్సిపల్ కమిషనర్లు రఘునాథ్ రెడ్డి, రవీంద్రబాబు, జోసఫ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker