
ప్రకాశం :ఒంగోలు:- భారతదేశ స్వతంత్ర సమరయోధుడు అష్ఫాఖుల్లా ఖాన్ వర్ధంతి కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆల్ ఇండియా సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పలువురు దళిత, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు అష్ఫాఖుల్లా ఖాన్ దేశ స్వాతంత్ర్య పోరాటంలో తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడని గుర్తు చేశారు. నేటి యువతరం ఆయన త్యాగాలు, ఆదర్శాలను అనుసరించాలని, దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారుAPUWJ 36th State convention to be held in Ongole 2025 June 24, 25, and 26: :ఎపియుడబ్లూజే రాష్ట్ర మహాసభలు.
ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మహమ్మద్ బుజ్జి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది షేక్ కరీముల్లా, ఇస్మాయిల్, సలార్, సత్తార్ పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ మాజీ కలెక్టర్ పేరయ్య, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం, ఏఐబీఎస్పీ జిల్లా కార్యదర్శి కామేపల్లి అయ్యప్ప, బహుజన నాయకులు చైతన్య ప్రసాద్ హాజరయ్యారు.

అదేవిధంగా రెడ్ స్టార్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు భీమవరపు సుబ్బారావు, బుద్ధిస్టు సొసైటీ నాయకులు మురహరి, దళిత సంఘం నాయకులు కొమ్ము శ్యామ్యూల్, బహుజన సంఘం మహిళా నాయకురాలు లక్ష్మీ తదితరులు పాల్గొని అష్ఫాఖుల్లా ఖాన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.










