
చెరుపల్లి: డిసెంబర్ 31 :-చెరుపల్లి గ్రామంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఐడీపీఎస్)లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేనేజింగ్ డైరెక్టర్ పైనం సాయి రంగారెడ్డి, ఐడీపీఎస్ ఏపీ–తెలంగాణ హెడ్ సిహెచ్ రామరాజు, ప్రిన్సిపల్ మణి వర్మ, నాన్ అకాడమిక్ డైరెక్టర్ వి. సుధా మాధవి, ఐడీపీఎస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ రవి ప్రకాష్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పైనం సాయి రంగారెడ్డి మాట్లాడుతూ, క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, జాతీయ సేవాభావం పెంపొందుతాయని తెలిపారు. ఇవి విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతాయని అన్నారుinternational Delhi public School cherukupalli: సంక్రాంతి శుభాకక్షలు 2025.
ఏపీ–తెలంగాణ హెడ్ సిహెచ్ రామరాజు మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో అంకితభావం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు.

స్పోర్ట్స్ మీట్ జాతీయ జెండా ఆవిష్కరణతో ప్రారంభమై, విద్యార్థుల మార్చ్ పాస్ట్‌తో కొనసాగింది. అనంతరం పరుగు పందాలు, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలైన విద్యార్థులు, తల్లిదండ్రులకు బహుమతులు అందజేయగా, పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉపాధ్యాయులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేశారు.







