
చీరాల:డిసెంబర్ 31:- జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల పాలిటెక్నిక్ విద్యార్థులు ఓవర్ ఆల్ ఛాంపియన్‌షిప్‌ను సాధించి ఘన విజయం సాధించారు.
ఇటీవల ఒంగోలు దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్ విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచి విన్నర్స్, రన్నర్స్‌గా నిలిచి ఓవర్ ఆల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.

వాలిబాల్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్ (సింగిల్స్, డబుల్స్) పోటీల్లో విజేతలుగా నిలవగా, కబాడీ పోటీల్లో రన్నర్స్‌గా నిలిచినట్లు కళాశాల డైరెక్టర్ (డిప్లొమా) డా. కె. విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు.Chirala Local News
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్. లక్ష్మణరావు సంయుక్తంగా మాట్లాడుతూ విద్యార్థుల క్రీడా ప్రతిభ ప్రశంసనీయమని అభినందించారు. అలాగే ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. ఎస్.వి.డి. అనిల్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమన్నారు.
విద్యార్థుల విజయానికి వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు, డా. సి. సుబ్బారావు (డైరెక్టర్ – అక్రిడిటేషన్స్), ఆర్.వి. రమణమూర్తి (మేనేజర్ – అడ్మినిస్ట్రేషన్), విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తోడ్పాటు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు విజేతలను ఘనంగా అభినందించారు.







