chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు: డిసెంబర్ 31:-ప్రజలకు అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు.

బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చి యార్డ్‌లోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాల శుభ్రతతో పాటు ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం తీసుకుంటున్న వారి సంఖ్య, నిర్వహణ విధానం, శుభ్రత పనులపై క్యాంటీన్ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు.

Guntur Local News :అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

అల్పాహారం తీసుకుంటున్న కార్మికులు, మిర్చి విక్రయానికి వచ్చిన రైతులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహన డ్రైవర్లతో కలెక్టర్ మాట్లాడి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకోగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా అల్పాహారాన్ని భుజించి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Guntur Local News :అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నందున భోజనశాల, ఆహార సరఫరా ప్రాంతాలు, క్యాంటీన్ ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణతో పాటు మౌలిక వసతులపై నగరపాలక సంస్థ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ఎన్‌టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

అనంతరం మిర్చి యార్డ్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్‌లో జనవరి నెల ఎన్‌టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పలువురు వృద్ధులు, వితంతువులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్ దారుల జీవన విధానం, రేషన్ సరఫరా, ఆరోగ్య పరిస్థితులు, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

Guntur Local News :అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ రుణాల మంజూరుకు సంబంధించిన సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని తక్షణమే పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారుసైన్స్ ఫెయిర్‌ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రంపై ఆసక్తిపెరుగుతుంది -కలెక్టర్.

తదుపరి కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డును పరిశీలించిన కలెక్టర్, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తిచేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణ ప్రదేశంలో సైడ్ డ్రెయిన్‌లపై ఉన్న పైపులైన్లను పక్కకు మార్చాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Guntur Local News :అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, నగరపాలక సంస్థ ఎస్ఈ సుందర రామిరెడ్డి, ఎంహెచ్ఓ డా. లక్ష్మీనారాయణ, ఉపాసెల్ పీఓ సింహాచలం, సచివాలయ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker