
hyderabad : ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 3న అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటో సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం పిలుపునిచ్చారు.

హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.Hyderabad news ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ బీమాను రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించిందని వెంకటేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు హామీని కూడా ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.
ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ఉబర్ టూ వీలర్ సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో మీటర్ చార్జీల పెంపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు.
బైట్: బి. వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్.
బైట్: వేముల మరయ్య, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు.










