
చీరాల:- ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు హాజరై, ప్రజల నుంచి స్వయంగా సమస్యల వినతిపత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మొత్తం 130కు పైగా అర్జీలు అందగా, వాటిలో ఇంటి నిర్మాణాలు, ఇంటి స్థలాల కోసం 60, పింఛన్లకు సంబంధించి 65, ఇతర వివిధ సమస్యలపై 5 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.Chirala Local News అందిన ప్రతి అర్జీని పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతువరపు జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత, కూటమి నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.Chirala Local News ప్రజా దర్బార్‌కు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.







