
చీరాల:సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో ఎంబీఏ విద్యార్థుల కోసం “నీడ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్” అనే అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు కళాశాల సెక్రటరీ శ్రీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు.
ఈ గెస్ట్ లెక్చర్‌లో ఐఈఎల్టీఎస్, జీఈఎస్ఈ ట్రైనర్ ఎస్.కే. కాలేషావలి ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతను వివరించిన ఆయన, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధించడంలో ఈ నైపుణ్యాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, విఫలమయ్యే కారణాలు, వాటిని అధిగమించేందుకు సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఎలా ఉపయోగపడుతుందో స్పష్టంగా వివరించారు.Chirala Local News
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు, ఎంబీఏ విభాగాధిపతి డా. ఆర్. ఇమ్మానియేల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










