
ఎన్టీఆర్ జిల్లా: పెనుగంచిప్రోలు:-పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామంలో రీ-సర్వే అనంతరం ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్స్‌తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పాలన కొనసాగుతోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలలో ఉన్న తప్పిదాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
అన్ని సమస్యలను పరిష్కరించి, ఇప్పుడు జగన్ ఫోటో స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ కలిగిన నూతన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.NTR VIJAYAWADA News
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శాంతిలక్ష్మీ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, ఎంపీటీసీ వెల్ది ప్రభాకర్, గ్రామ టీడీపీ అధ్యక్షులు వెల్ది శ్రీనివాసరావు, జిల్లేపల్లి సుధీర్ బాబు, వెల్ది అశోక్, అప్పారావు, వడ్లమూడి వెంకటేశ్వరరావు, మాదినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.










