
బాపట్ల: జనవరి 4:-నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.20కే కిలో గోధుమపిండిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని బాపట్ల జనసేన నాయకులు, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ పేర్కొన్నారు. ఆదివారం బాపట్ల పట్టణం 19వ వార్డు (కోట్రా వారి వీధి) పరిధిలోని రేషన్ షాపులో లబ్ధిదారులకు రాయితీ గోధుమపిండిని ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతోనే ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందని ప్రశంసించారు.Bapatla local News మార్కెట్‌లో కిలో గోధుమపిండి రూ.60–65 వరకు ఉండగా, ప్రభుత్వం రూ.20కే అందించడం వల్ల పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని తెలిపారు.
ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆహార భద్రతను పటిష్టం చేసిన కూటమి ప్రభుత్వం నిజంగా సామాన్యుడి ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు.Bapatla pattanam lo MLA పేదల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే లక్ష్యంగా అఖండ ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.










