
పర్చూరు:- నియోజకవర్గంలో పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియను ఎక్కడా లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.Bapatla Local News
ఆదివారం పర్చూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మార్టూరు వ్యవసాయ శాఖ అధికారిణి లావణ్య క్రాప్ బుకింగ్ ప్రక్రియపై ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కజొన్న, శనగ పంటలు సాగు చేస్తున్న రైతులు ఒక్కరూ మిగలకుండా తప్పనిసరిగా పంటల నమోదు చేయాలని సూచించారు.bapatla news
రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, పంటల నమోదు పూర్తిగా జరిగితేనే ప్రభుత్వ పథకాల లాభాలు అందుతాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి అవగాహన కల్పిస్తూ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్నదాతల ప్రయోజనాలే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సీఎం సహాయనిధి (CMRF), ఎల్‌ఓసీ (LOC) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి వరప్రదానిగా మారిందని, అత్యవసర చికిత్సకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.

ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఇంకొల్లు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు అత్యవసర చికిత్స కోసం ఎల్‌ఓసీ ద్వారా మంజూరైన రూ.1,47,143 చెక్కును అందజేశారు. అలాగే ఇసుకదర్శి గ్రామానికి చెందిన వల్లెపు పార్వతికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1 లక్ష చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉత్తర్వుల అందజేత
అదేవిధంగా ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పర్చూరు మండల పార్టీ అధ్యక్షులు శంషుద్దీన్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలప్రదంగా అమలవుతాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, నల్లపునేని రంగయ్య చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










