
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కమ్యునిటి భవన్ కోసం రాజధానిలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ విషయంలో బీసీ డి నుంచి ఏ లోకి మార్చాలని సూచించారు. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నామినేట్ పదవులు ఇవ్వాలని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ముదిరాజ్ లను ఏకం చేసి పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం, జిల్లా అధ్యక్షుడు గొడుగు శంకర్, రాజు, సాంబశివరావు, రాంబాబు, శేఖర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.







