
గుంటూరు లోని ఏటి ఆగ్రహరంలో 13వ లైన్ లో గిరిజన వసతి గృహంలో గిరిజన విద్యార్థులు అనేక సమస్యలతో సతమతంతో ఆందోళన చెంది గిరిజన సమాఖ్య నాయకులకు తెలియజేశారు.ఆదివారం గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ సందర్శించడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు సక్రమంగా ఆహారం అందించడం లేదని, మంచినీటి వాటర్ ప్లాంట్ మరమ్మత్తులు చేయించలేదని, దీంతో విద్యార్థులు ఉప్పు నీటితో స్నానం చేయడం వలన ఒళ్లంతా దురద, దద్దుర్లు ఏర్పడుతున్నాయన్నారు. విద్యార్థులు నగదు చెల్లించి మంచి నీరు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గత మూడు నెలలుగా ఈ విధంగా జరుగుతున్న సంబంధిత వార్డెన్ కి విద్యార్థులు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులు అనారోగ్యాలకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికన ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించిన వార్డున్ ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాని కోరారు. వసతి గృహంలో విద్యార్థుల కోసం వారానికి ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. వసతి గృహం బయట విద్యార్థులతో కలిసి వార్డెన్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బి. రాంబాబు నాయక్,ఆర్. మహేష్ నాయక్ తోపాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.







