గుంటూరు

భక్తిశ్రద్ధలతో చండీహోమం

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పలురకాల హోమద్రవ్యాలతో హోమ పూర్ణాహుతి జరిగింది. అన్నమయ్య కళావేదికపై ప్రముఖ సాహితీవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button