BREAKING NEWS – GUNTUR: గుంటూరు ఛానల్ విస్తరణ కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ. 400 కోట్లు కేటాయింపు
CENTRAL MINISTER PEMMASANI PRESS MEET
గుంటూరు ఛానల్ కోసం రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న గుంటూరు ఛానల్ కోసం నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు గుంటూరులో శుక్రవారం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఛానల్ విస్తరణలో భాగంగా 100 కోట్ల రూపాయలు భూ సేకరణ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు.
ఛానల్ విస్తరణ పనుల కోసం మరో 300 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. దీని ద్వారా 27 కిలో మీటర్లు మేర గుంటూరు ఛానల్ ని విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా
38 వేల ఎకరాలకు సాగునీరు,
39 వేల గ్రామాలకు తాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు తోపాటు ఆధునీకరణ పనులు కోసం మరో 600 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెట్టామని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, మహ్మద్ నసీర్, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.