
బాపట్ల:జనవరి :-బాపట్ల జిల్లా మలేరియా అధికారిగా శ్రీ నాగార్జున గారు శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముందుగా గౌరవ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీమతి డాక్టర్ విజయమ్మ మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ విజయమ్మ మేడం మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిబద్ధతతో పనిచేస్తూ మలేరియా, డెంగీ వంటి వెక్టర్ బోర్న్ వ్యాధుల నియంత్రణలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేసి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.bapatla news
జిల్లా మలేరియా అధికారి శ్రీ నాగార్జున గారు మాట్లాడుతూ, అధికారుల సమన్వయం, సిబ్బంది ఐక్యతతో ప్రభుత్వ నిర్దేశాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. జిల్లాలో మలేరియా, డెంగీ, చికెన్ గునియా, బోదకాలు తదితర కీటకజనిత వ్యాధుల నిర్మూలనకు ప్రభావవంతమైన కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు.
ప్రజారోగ్య రంగంలో అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన శ్రీ నాగార్జున గారి నాయకత్వంలో జిల్లాలో వ్యాధి నియంత్రణ చర్యలు మరింత బలోపేతం కానున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ యూనిట్ అధికారులు, మలేరియా శాఖ సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.










