
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక ఊతం లభిస్తోంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి సిఫారసు మేరకు అత్యవసర చికిత్స నిమిత్తం తనుబొద్దువారిపాలెం గ్రామానికి చెందిన దొడ్డ అంజమ్మకు LOC ద్వారా రూ.84,000 చెక్కును మంజూరు చేశారు.
ఈ చెక్కును ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏలూరి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారికి నాయకులు, క్యాంపు కార్యాలయ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అవసరంలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సహాయం అందిస్తామని తెలిపారు.Bapatla Local News
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు ఎప్పుడూ ముందుంటారని, ఇకపై కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటామని క్యాంపు కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు.










