chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బీసీలకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది – జీవీఎల్ మోహన్ గౌడ్

బాపట్ల:-సమాజంలో సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న బీసీలు నేటికీ తగిన స్థానం దక్కించుకోలేకపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎల్ మోహన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం బాపట్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జీవీఎల్ మోహన్ గౌడ్ జిల్లా కమిటీ నాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సంఘం నాయకులతో సమన్వయంతో పని చేస్తూ బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

ఇటీవల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు జీవీఎల్ మోహన్ గౌడ్‌కు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామక పత్రాన్ని అందజేశారని జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ వెల్లడించారు.Bapatla Local News అదే సందర్భంగా జిల్లా కార్యదర్శిగా అవ్వారు సాంబశివరావును నియమిస్తూ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చేజర్ల సతీష్, శివకుమార్, జిల్లా కార్యదర్శులు మారం రవికుమార్, ఎన్ ఎస్ పి రాజు, నాయకులు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, మారం భాను, గోపి, కంకణాల రాంబాబు, ఉల్చి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker